టాలెంట్ ఎవరి సొత్తు కాదు టైం కలిసొస్తే ఎవడి దమ్ము ఎంత ఉందో బయట పడుతుంది అన్న మాటల్ని అక్షరాలా నిజం చేసాడు బ్లఫ్ మాస్టర్ మూవీ తో ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్… ఇక రీసెంట్ గా వెంకటేష్ మహా డైరెక్షన్ లో అయన చేసిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది..
ఈ ఉత్సాహం తోనే తన నెక్స్ట్ మూవీ ని కూడా అనౌన్స్ చేసాడు సత్యదేవ్ lovemoktyle అనే కన్నడ రీమేక్ లో నటిస్తున్నాడు .అయితే ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తుందని టాక్ రావడం తో దీనిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి .ఇప్పటి దాక స్టార్ హీరోల పక్కన నడిచిన తమన్నా సత్యదేవ్ తో సినిమా అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట…
తమన్నా కి ఆ సినిమా లో అంత కనెక్ట్ అయినా పాయింట్ ఏంటో తెలుసు కోవాలంటే సినిమా వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే… తెలుగులో కూడా కన్నడ డైరెక్టర్ శేఖర్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు… ఇక ఈ సినిమాలోని మిగతా యాక్టర్ ల విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది .అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మొదటి సినిమా కావటం తో ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి