బంగారం ధర మళ్లీ మార్కెట్లో తగ్గుముఖం పట్టింది, బంగారం ధర గడిచిన మూడు రోజులుగా తగ్గుతూనే వస్తోంది, నేడు కూడా మార్కెట్లో తగ్గింది బంగారం ధర, పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది..మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గింది. దీంతో ధర రూ.54,580కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.460 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.50,030కు చేరింది.
ఇక పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగానే తగ్గింది. కేజీ వెండి ధర రూ.410 దిగొచ్చింది. దీంతో ధర రూ.66,700కుచేరింది. ఇంకా వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్లలో పెట్టుబడులు మధుపరులు పెట్టడంతో భారీగా బంగారం ధర తగ్గుతోంది, వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంటుంది అని అంటున్నారు అనలిస్టులు.