ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ కోమాలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి, అంతేకాదు ఆయన సోదరి కిమ్ యో-జోంగ్ దేశ పగ్గాలు చేపట్టడానికి సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి, తమ వైపు ఉన్న నేతలు ఉన్నత అధికారులకి కూడా ఈ విషయం ఇంకా చెప్పలేదట, అయితే దీనిపై ఓ జర్నలిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కిమ్ జోంగ్-ఉన్ చనిపోయాడని తాను నమ్ముతున్నానని ఉత్తరకొరియా దేశవ్యాప్తంగా పర్యటించిన రాయ్ కాలీ అనే జర్నలిస్ట్ అన్నారు. దేశంలో ఎలాంటి విషయాలు మీడియా ముఖంగా బయటకు రావడం లేదు అన్నారాయన, అంతేకాదు పెద్ద కార్యచరణ స్టార్ట్ అయింది అని అంటున్నారు ఆయన.
ఇక గతంలో కిమ్ కుటుంబం ఎలా వ్యవహరించిందో అదే జరుగుతుందని..కిమ్ తండ్రి.. కిమ్ జోంగ్-ఇల్ మరణించిన సమయంలో కూడా ఈ విషయం బయటపెట్టలేదు, తర్వాత నెలలు గడిచిన తర్వాత చెప్పారు, కిమ్ ఈలోగా బాధ్యతలు చేపట్టారు, ఇప్పటి పరిస్దితి చూస్తే అదే భావన కలుగుతోంది అంటున్నాడు కాలీ, లేకపోతే సోదరికి ఎందుకు పగ్గాలు ఇస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. దేశ భద్రత అనిశ్చితి లేకుండా ఇలా నిర్ణయం తీసుకుంటున్నారని అక్కడ వారు భావిస్తున్నారు.