పటికబెల్లం తియ్యగా పిల్లలకు చాలా ఇష్టమైన ఫుడ్ అనే చెప్పాలి, అయితే చిన్న పిల్లలు ఇది పాలల్లో వాటర్ లో కూడా కలుపుకుని తీసుకుంటారు, . చెక్కర శుద్ధి చేయబడని రూపమే ఈ పటికబెల్లం. దీన్ని వంటల్లోనూ అలాగే వైద్య ప్రయోజనాల కోసం వాడతారు. పలు చూర్ణాలు ఆయుర్వేద మూలికలు ఇందులో కలిపి తీసుకుంటారు చాలా మంది.
పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. కాని ఇది ఎక్కువ తింటే మాత్రం మల బద్దకం సమస్య వస్తుంది, అతి తక్కువగా తీసుకోవాలి, అలాగే పటిక బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం.
అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
పటిక బెల్లం పొడి పసుపు కలిపి నిప్పుల మీద చల్లితే ఆ వాసనకు జలుబు తగ్గుతుంది
ఎక్కిల్లు తగ్గాలి అన్నా పటికి బెల్లం చప్పరించండి.
హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు పటికబెల్లం నీటిని ఇవ్వండి
నోటిలో పుండు ఉంటే, యాలకులతో పటిక బెల్లం కలపడం ద్వారా పేస్ట్ తయారు చేసి నీటిలో కలిపి సేవించండి.. ఇక వేడి పాలల్లో ఇది కలిపి తాగితే గొంతు బొంగుర తగ్గుతుంది. ఇక నిమ్మకాయ చెక్కపై చిన్న పటిక బెల్లం ముక్క పెట్టి చప్పరించండి. ఆశ్చర్యం వాంతులు తగ్గుతాయి.
నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండాలి అంటే, చిన్న పటిక బెల్లం ముక్క పెట్టుకోండి ఎంతో బాగుంటుంది నోటి నుంచి దుర్వాసన రాదు.