చాలా మంది డాక్టర్లు ఓ విషయం చెబుతారు ఉదయం లేవగానే కచ్చితంగా గోరు వెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది అని.. అయితే ఉదయం లేవగానే … బ్రష్ చేసుకోగానే… కాఫీనో, టీనో తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఇలా ఉదయం నీరు తాగితే చాలా మంచిది అంటున్నారు వైద్యులు.
ఈ అలవాటు వల్ల మంచి ఆరోగ్యంతోపాటు…. శారీరక రుగ్మతల నుంచి కూడా బయటపడవచ్చు. ఉదయం ఇలా రెండు గ్లాసులు నీరు తాగితే కడుపులో ఫ్రీగా ఉంటుంది, జీర్ణ సమస్యలు రావు, అలాగే మలబద్దకం ఉండదు పైల్స్ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇక రక్త ప్రసరణ బాగుంటుంది. చాలా మందికి పొట్ట దగ్గర శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అదంతా తగ్గిపోతుంది. ఇక జలుబు జ్వరం అలాంటి సమస్యలు రావు, శరీరంలో అన్నీ అవయవాల పనితీరు బాగుంటుంది.
ఇక శ్వాస సంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయి..ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. చర్మానికి, వెంట్రుకలకు కూడా చాలా మంచిది. ఇక నిమ్మరసం జీరా వాటర్ ఇలా ఏదైనా ఉదయం తీసుకుంటే మంచిది తేనె నీరు తీసుకున్నా మంచిదే అంటున్నారు వైద్యులు.