రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు, ఈ సినిమాకి జక్కన్న దర్శకత్వం వహిస్తున్నారు, అయితే ఈ చిత్ర షూటింగ్ కరోనాతో లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది, త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.. మరో ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం ఈ చిత్రానికి పట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
ఇక వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది, అయితే ఈ సినిమా తర్వాత తారక్ ఫుల్ బిజీ..
త్రివిక్రమ్ తో ఆయన సినిమా చేయనున్నారు, ఇక చరణ్ ఏ సినిమా చేస్తారు అనేది పెద్ద చర్చ చేస్తున్నారు అభిమానులు.
చరణ్ సుకుమార్ తో సినిమా చేసే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. ఇక సురేందర్ రెడ్డితో చరణ్ సినిమా ఉంటుంది అని మరో వార్త వినిపించింది… తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం కేజీఎఫ్ దర్శకుడు.ప్రశాంత్ నీల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.