పేటీఎం ప్రతీ స్మార్ట్ ఫోన్ లో వాడుతున్న యాప్, డిజిటల్ వాలెట్లలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది, కస్టమర్లకు అనేక ఫీచర్లు సౌకర్యాలు అందిస్తోంది, అయితే పేమెంట్ల విషయంలో, డిజిటల్ చెల్లింపుల విషయంలో పేటీఎం దేశంలో టాప్ లో ఉంది.
పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసు ఏఈపీఎస్ ను పేటీఎం ఆవిష్కరించింది. ఇక కచ్చితంగా మీ ఆధార్ కార్డ్ ద్వారా యూజర్లు నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు, ఇక బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు..త్వరలోనే నగదు డిపాజిట్, ఇంటర్బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి ఫీచర్లను లాంచ్ చేయాలని భావిస్తోంది.
ఇక మీరు ఆధార్ తో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటే చాలు. మీకు ఏఈపీఎస్ సర్వీసులతో క్యాష్ విత్డ్రాయెల్స్, బ్యాలెన్స్ విచారణ వంటి సేవలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వారికి చాలా ఉపయోగం, బ్యాంకు సేవలు దూరంగా ఉండి అందుబాటులో లేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది..10,000కి పైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం చేసుకుంది సంస్ధ.