స్నేహ తెలుగులో అగ్రహీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేశారు, ఆనాటి సావిత్రి తర్వాత సౌందర్య తర్వాత స్నేహ అలాంటి అద్బుత పాత్రలు చేయగలరు అనే పేరు ఆమె సంపాదించుకున్నారు.
స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. ఈమె ముంబైలో పుట్టారు, తర్వాత దుబాయ్ వెళ్లారు, అయితే ఆమెని ముందుగా
మలయాళ దర్శకుడు పాజిల్ చూసి దర్శకులకు రికమెండ్ చేసారు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి అనే సినిమా ద్వారా పరిచయం అయింది.
ఇక అచ్చాముందు- అచ్చాముందు లో స్నేహ ప్రసన్న తో మొదటిసారి నటించారు, అక్కడ నుంచి వీరి ప్రేమ పుట్టింది.. వారు 11 మే 2012 న చెన్నైలో వివాహం చేసుకున్నారు.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్ర హీరోలతో అనేక పాత్రలలో ఆమె నటించింది.
స్నేహ నటించిన మన టాప్ తెలుగు సినిమాలు చూద్దాం
తొలివలపు
ప్రియమైన నీకు
హనుమాన్ జంక్షన్
శ్రీరామదాసు
మహారధి
మధుమాసం
సంక్రాంతి
నీ సుఖమే నే కోరుకున్నా
దటీజ్ పాండు
వెంకీ
ఏమండోయ్ శ్రీవారు
రాధాగోపాలం
మనసు పలికే మౌనరాగం
ఆదివిష్ణు
పాండురంగ
s/o సత్యమూర్తి
వినయ విధేయ రామ