ఉద్యోగం చేయక్కర్లేదు ఖాళీగా ఉంటే జీతం – ప్రపంచంలోనే వింత జాబ్

ఉద్యోగం చేయక్కర్లేదు ఖాళీగా ఉంటే జీతం - ప్రపంచంలోనే వింత జాబ్

0
95

ఉద్యోగం చేస్తున్నా రెండు మూడు గంటలు ఎక్కువ పని చేసినా అదే శాలరీ ఇచ్చే కంపెనీలు కొన్ని ఉంటాయి, మరికొన్ని జీతాలు కటింగ్స్ చేసే కంపెనీలు ఉంటాయి, కాని ఏ పనీ చేయకపోతేనే రూ.1.41 లక్షల జీతం ఇస్తారు. జర్మనీలో ఈ జాబ్ ఆఫర్ ఉంది. జర్మనీ యూనివర్శిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ అవకాశం ఇస్తోంది.

అయితే దీనికి కండిషన్ ఏమిటి అంటే…మీరు ఏ పని చేయకూడదు, మీరు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండాలి. ఇలా చేస్తే 1800 యూరోలను ఇస్తారు. ఇక ఇంటి పని ఏ పని చేయకూడదు, ఇలా అప్లికేషన్ తెచ్చుకునే సమయంలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు.

ఎందుకు మీరు ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు, మీ కుటుంబం అలాగే మీరు ఎంత కాలం ఇలా ఉండగలరు ఇవన్నీ కూడా అడుగుతారు..వారికి సంతృప్తికర సమాధానం చెప్పారనిపిస్తే జాబ్ ఇస్తారు…ఏ పనీ చేయనివారి ఆలోచనలు, ప్రవర్తన, సమాచారాన్ని ఈ యూనివర్శిటీ కలెక్ట్ చేయాలనుకుంటోంది. ఇక వచ్చే నెల 15 వరకూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.