నాటి స్టార్ హీరోయిన్లు కొందరు ఇంకా సినిమా పరిశ్రమలో నటించాలి అని భావిస్తూ, తమకు వచ్చిన రోల్స్ చేస్తున్నారు ..కొందరు అమ్మ అక్క చెల్లి పాత్రలు చేస్తుంటే, మరికొందరు నెగిటీవ్ రోల్స్ చేస్తున్నారు, ఇలా చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, అయితే తాజాగా అలనాటి అందాల తార అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు సీనియర్ నటి మీనా.. ఆమె కూడా ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటించాలి అని భావిస్తున్నారు.
సీనియర్ హీరోలు అగ్రహీరోలు అందరితో ఆమె నటించారు, ఇప్పుడు ఆమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు..దృశ్యం-సాక్షం సినిమాలో ఆమె నటించారు, ఇక వెబ్ సిరిస్ లో కూడా నటించారు..అయితే ప్రస్తుతం తాను నెగిటివ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని అంటున్నారు ఆమె.
సీనియర్ హీరోయిన్స్ లో రమ్యకృష్ణ , సిమ్రాన్ లాంటివారు నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో అందాల తార మీనా కూడా చేరారు అని తెలుస్తోంది, దృశ్యం-2 ,తమిళ్ లో రజినీకాంత్ సరసన అన్నాత్తే సినిమాలు ఆమె చేస్తున్నారు.