మన తెలుగు హీరోలు చాలా మంది వాళ్ల వాయిస్ వారే డబ్బింగ్ చెప్పుకుంటారు అనేది తెలిసిందే, హీరోయిన్లు మాత్రం నార్త్ నుంచి వచ్చిన కొందరికి వేరే సింగర్స్ డబ్బింగ్ చెబుతారు, అయితే మన హీరోలు పలు సినిమాల్లో డ్యాన్సులు చేయడమే కాదు వాళ్ల పాటలకి వాళ్ల గాత్రం అందించారు.
చాలా మందికి తెలియకపోవచ్చు కాని, వారి సినిమాలో పాటలు కూడా పాడి తమ గాత్రంతో అభిమానులని అలరించారు. నాటి హీరోల నుంచి నేటి హీరోల వరకూ చాలా మంది ఇలా రికార్డింగ్ సూట్లో సాంగ్స్ పాడిన వారు ఉన్నారు, మరి ఆ హీరో కమ్ సింగర్స్ ఎవరో చూద్దాం, అలాగే వారు పాడిన పాటలు ఏ సినిమాలో చూద్దాం.
చిరంజీవి మాస్టార్ సినిమాలో తమ్ముడు అరె తమ్ముడు పాట పాడారు
మృగరాజు సినిమాలో ఏ ఛాయ్ చటుక్కున తాగరా బాయ్ అనే పాట పాడారు
నితిన్- ఇష్క్ సినిమాలో కోడివాయే లచ్చమ్మది పాట పాడాడు
గురు సినిమాలో వెంకటేష్ జింగిడి జింగిడి జింగిడి అనే పాట పాడారు
బాలకృష్ణ – పైసా వసూల్ సినిమాలో మామా ఏక్ పెగ్ లా.. పాట పాడారు
విజయ్ దేవరకొండ – అమెరిక గర్ల్ అయినా..అత్తిలి గర్ల్ అయినా గీత గోవిందంలో పాడారు
పోటుగాడు సినిమాలో ప్యార్ మే పడిపోయానే పాట మనోజ్ పాడారు
హీరో ధనుష్ పాడిన పాట కొలవెరి డి ఎంతో ఫేమస్ సాంగ్
హీరో సిద్దార్ద్ – అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి..బొమ్మరిల్లు లో పాడారు
నిర్మల కాన్వెంట్ సినిమాలో నాగార్జున కొత్తకొత్త భాష అనే పాట పాడారు
జూనియర్ ఎన్టీయార్ – ఫాలో ఫాలో ఫాలో పాట నాన్నకు ప్రేమతో సినిమాలో పాడారు
రాకాసి రాకాసి అనే పాట రభస చిత్రంలో పాడారు
123 నేనొక కంత్రి ఈ సాంగ్ కంత్రి సినిమాలో పాడారు
ఓలమ్మో సాంగ్ యమదొంగ నుంచి పాడారు
అదుర్స్ సినిమాలో చారీ అనే పాట పాడారు
కాటమరాయుడా కదిరి నరసింహుడా అనే పాట పవన్ కల్యాణ్ పాడారు
రవితేజ పవర్ సినిమాలో నోటంకి నోటంకి పాట పాడారు