కొత్త రంగంలోకి సమంత….

కొత్త రంగంలోకి సమంత....

0
95

టాలీవుడ్ లోని అందరు హీరోయిన్ లతో పోలిస్తే సమంత తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది .. తన కోసమే దర్శకులు పాత్రలు పుట్టించే స్థాయికి సమంత చేరుకుందంటే ఆషామాషీ విషయం కాదు . తన హార్డవర్క్ ,డెడికేషన్ తనకి ఓ గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టాయి .

ఓహ్ బేబీ చిత్రం తో తన ఇమేజ్ ఎవరి ఇమాజినేషన్ కి అందనంత స్థాయికి వెళ్ళింది . ఒక నటిగా ఎందరో అభిమానుల్ని సంపాదించినా ఆమె సామజిక సేవ కార్యక్రమాల్లో ను ముందుంటారు . తాను ప్రత్యుష అనే సంస్థను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే ..అయితే ఇంకో అడుగు ముందుకేసి చిన్నపిల్లల కోసం ఒక ప్రీ స్కూల్ ని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించుకున్నారు .

సమంత తీసుకున్న ఈ నిర్ణయం పై అటు ఇండస్ట్రీ నుండి ఇటు అభిమానుల నుండి ప్రశంసల వెల్లువ కురుస్తుంది .. జీవితం లో ఎదగడం గొప్ప కాదు..పదిమందికి జీవితానివ్వడం గొప్ప అంటూ సమంత అభిమానులు ఆమె చేస్తున్న ఈ సేవలకు సలాం చేస్తున్నారు .