పెళ్లిచూపులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు .. చాల మంది హీరోలకి ఎన్నో సినిమాలు తీస్తేగాని రాని క్రేజ్ విజయ్ కి ఆ ఒక్క సినిమాతో వచ్చింది ..
అయితే అలంటి భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీ మాత్రం అభిమానుల్ని నిరాశ పరిచింది .. అయితే ఈ సినిమా ఆడకపోవడానికి ఎన్ని కారణాలు వున్నా అవార్డులు మాత్రం తెచ్చిపెట్టింది ..
అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డుని సొంతం చేసుకుంది .
యూట్యూబ్ లో ఈ మూవీ 2 మిలియన్ లైక్స్ సాధించి తెలుగు సినిమాలన్నిటిలోను ముందు స్థానం లో నిలిచింది .. సినిమా విజయం సాదించనంత మాత్రాన అందులో విషయం లేనట్టు కాదని ఈ సినిమా నిరూపించింది అంటూ విజయ్ అభిమానులు చెబుతున్నారు ..