కొర‌టాల అల్లు అర్జున్ సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడు ఆయ‌నేనా?

కొర‌టాల అల్లు అర్జున్ సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడు ఆయ‌నేనా?

0
139

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఆయ‌న సినిమాల‌కు సంగీతం ఇచ్చారు అంటే అవి సూప‌ర్ హిట్ అవ్వాల్సిందే, గ‌తంలో మ‌ణిశ‌ర్మ ఎంతో బిజీగా ఉండేవారు అగ్రహీరోలు అంద‌రూ ఆయ‌న‌తోనే సినిమా అనేవారు.
టాలీవుడ్ లో మణిశర్మ సంగీతమే గుర్తొచ్చేది అంద‌రికి, దాదాపు అగ్రహీరోలందరికి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన మణిశర్మ కొంత‌కాలం నుంచి పెద్ద‌గా సినిమాల‌కు పాట‌ల‌కు బాణీలు ఇవ్వ‌డం లేదు.

ఇక ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకి పూరీ ఆయ‌న‌తో వ‌ర్క్ చేయించారు…అదిరిపోయే బ్యాగ్రౌండ్ తోపాటు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు, ఇక త‌ర్వాత నుంచి ప‌లు ఆఫ‌ర్లు ఆయ‌న‌కు వ‌చ్చాయి, ఇక తాజాగా మెగాస్టార్ ఆచార్య సినిమాకి కూడా ఛాన్స్ ఆయ‌న‌కు వ‌చ్చింది.

ఇక తాజాగా అల్లుఅర్జున్ తో కొర‌టాల సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే.. ఈ సినిమాకి కూడా మ‌ణిశ‌ర్మ‌ని తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది, ఇక గ‌తంలో బ‌న్నీకి పరుగు , వరుడు సినిమాలకు మణిశర్మ సంగీతం అందించారు, ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది, వీరి కాంబో సూప‌ర్ అంటున్నారు బ‌న్నీ అభిమానులు.