సింగర్ నోయల్ హీరోయిన్ ఎస్తేర్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, గత ఏడాది ఈ జంట ఒక్కటయ్యారు, ఎన్నో ఏళ్లు ప్రేమించి వివాహం చేసుకున్నారు ఈ జంట, టాలీవుడ్ నటులు కూడా వీరి వివాహానికి హాజరు అయ్యారు, అయితే తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు, అయితే గతంలో వీరి జంట విడిపోతుంది అని అనేక వార్తలు వచ్చాయి. కాని దీనిపై ఏమీ మాట్లాడలేదు, కాని తాజాగా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది, అందుకే ఆమె ఈ ప్రకటన చేశారు.
జనవరి 3న ఎస్తేర్-నోయెల్ పెళ్లి చేసుకున్నారు.ఇద్దరికి సర్దుబాటు సమస్యలు వచ్చాయట, ఈ కారణంతో ఐదు నెలలకే విడిపోయారు, అయితే ఆమె మాత్రం నటిగా కొనసాగుతున్నారు. తెలుగు తమిళ మళయాల సినిమాల్లో నటిస్తున్నారు, ఆమె 1000 అబద్ధాలు -భీమవరం బుల్లోడు -జయజానకి నాయక సినిమాలో నటించిన విషయం తెలిసిందే.