నందమూరి నటసింహం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు, ఈ సినిమాపై అనేక అంచనాలు ఉన్నాయి, ఈ కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి, అయితే ఈ సినిమాకి టైటిల్ ఏమిటి అనేది ఇంకా చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు, ఇప్పటికే అనేక పేర్లు వినిపించాయి.
అయితే బాలయ్య బోయపాటి సినిమాలో కచ్చితంగా టైటిల్ పై ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.. అందుకే ఆ టైటిల్ ఏమై ఉంటుంది అని ఆలోచన అందరిలో ఉంది.మోనార్క్, డేంజర్ ఇలా చాలా పేర్లు వినిపించాయి.
కాని తాజాగా అరవింద సమేతలో ఎన్టీఆర్ ని పోలుస్తూ చెప్పిన మాటని ఓ టైటిల్ గా ఆలోచిస్తున్నారట, అదే టార్చ్ బేరర్, ఇది పరిశీలనతో ఉంది అని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దీనిపై త్వరలో క్లారిటీ రానుంది, అయితే నందమూరి అభిమానులు మాత్రం ఈ టైటిల్ బాగుంది అని కోరుతున్నారు, సో మరి దీనీపై త్వరలో క్లారిటీ అయితే రానుంది. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.