ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది.. ఏకంగా రెండున్నర కోట్ల మందికి సోకింది. లక్షల మరణాలు సంభవించాయి, ఇంకా అన్నీ దేశాలు కూడా ఈ కరోనా కోరల్లో చిక్కుకున్నాయి, అయితే ఈ కరోనా కి వ్యాక్సిన్ వచ్చే వరకూ అంతం అవ్వదు అంటున్నారు నిపుణులు.
ఇక ఇలాంటి వైరస్ కాలంలో మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండోనేషియాలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది.. కొద్ది రోజుల క్రితం మలేషియాలో కనిపించిన డీ614జీ వైరస్ ఆనవాళ్లు.. ఇప్పుడు ఇండోనేషియాలో కూడా కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే ఈకేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇది అక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఈ కరోనా వైరస్ తో పోలిస్తే 10రెట్ల తీవ్రత కలిగిన డీ614జీ వైరస్ ఈ మధ్య మలేసియాలోనూ కనిపించింది
ఇది వేగంగా విస్తరిస్తున్నా దీని వల్ల ప్రాణాపాయం ఉండదు అంటున్నారు.ఇండోనేషియాలో లక్ష 72 వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 7 వేల 300 మరణాలు సంభవించాయి. జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ వైద్య శాఖ తెలిపింది ప్రజలకు.