దేశంలో అన్ లాక్ 4 నడుస్తోంది, కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది, అన్నీ తెరచుకుంటున్నాయి, ఈ సమయంలో తమిళనాడు లో మాత్రం మరోసారి లాక్ డౌన్ విధించారు. ఇక్కడ భారీగా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రోజుకి 6 వేల వరకూ కేసులు నమోదు అవుతున్నాయి, అందుకే ముందుగా అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకున్నారు.. సిఎం పళని స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. లాక్ డౌన్ విధించాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ని సెప్టెంబర్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
అంతేకాదు తమిళనాడులోని ఉన్న అన్ని ఆలయాల దర్శనాలకు అనుమతులను రద్దు చేసారు, కచ్చితంగా తమిళనాడు వస్తే ఎవరు అయినా ఈ పాస్ తీసుకోవాలి అని తెలిపారు.. కఠినంగా ఉండాలి అని అధికారులకి తెలిపారు లాక్ డౌన్ విషయంలో.. కాస్త రిలీఫ్ అయిన విషయం ఏమిటి అంటే, జిల్లాల మధ్య ప్రయాణాలకు ఈ పాస్ ని రద్దు చేసారు. ఇక్కడ మరణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.