గడిచిన రెండు నెలలుగా పెరిగిన బంగారం ధర మళ్లీ నేల చూపులు చూస్తోంది. బంగారం ధర మళ్లీ పడిపోయింది. పసిడి ధర భారీగా దిగొచ్చింది. అయితే ఎన్నడూ లేనిది మార్కెట్లో వెండి కూడా తగ్గడం స్టార్ట్ అయింది.
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.560 పడిపోయింది. దీంతో ధర రూ.49,160కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.570 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,630కు చేరింది.
ఇక వెండి ధర కూడా ఈరోజు భారీగా తగ్గింది. 1400 తగ్గింది, నిన్నటి కంటే మార్కెట్లో భారీగా వెండి ధర తగ్గింది. 65800 కిలో వెండి మార్కెట్లో ట్రేడ్ అవుతోంది, ఇక వచ్చే రోజుల్లో మరింత వెండి తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు, ఇక బంగారం ధర కూడా వచ్చే రోజుల్లో మరింత తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.