మన అభిమాన హీరో సినిమా బాగుండకపోతే అతని కంటే మనం ఎక్కువ బాధపడతాం ..అంతగా మనం సినిమా వాళ్ళనంటే అభిమానం పెంచుకున్నాం .ఇక మనం అభిమానించే నటులు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం .వాళ్ళు లేరన్న బాధతో సూసైడ్ చేసుకున్న అభిమానులు లేకపోలేదు .అర్దాంతరంగా చనిపోయిన మన నటుల ఆఖరి సినిమాల గురించి తెలుసుకుందాం .
సుశాంత్ సింగ్ మరణం తర్వాత దిల్ బచేరా చిత్రం రిలీజ్ అయింది ..ఈ చిత్రం అఖండ విజయం సాధించిన అభిమానుల్లో అయన లేడన్న లోటుని మాత్రం పూడ్చలేకపోయింది . అక్కినేని నాగేశ్వరరావు గారు తన కుటుంబంతో నటించింన ఆఖరి చిత్రం మనం .అక్కినేని ఫామిలీ మొత్తాన్ని ఒకే స్క్రీన్ లో చూడబోతున్నామన్న ఆనందం అభిమానుల్లో ఒక్కసారిగా అయన మరణం తో విషాదంగా మారింది . మరో సావిత్రిగా మనం చెప్పుకునే సౌందర్య శివశంకర్ మూవీ హెలికాఫ్టర్ ప్రమాదం లో కన్ను మూసింది . ఇక 1993 లో దివ్యభారతి మరణానంతరం ఆమె చేసిన తొలిముద్దు సినిమా రిలీజ్ అయింది . ఇక మిస్టరీ గానే మిగిలిపోయిన ప్రత్యూష మరణం తర్వాత ఆమె చేసిన సౌండ్ పార్టీ అనే తమిళ సినిమా రిలీజ్ అయింది.
ధర్మవరపు సుబ్రమణ్యం చనిపోయిన తర్వాత అయన ఆఖరి చిత్రం అమృతం లో చందమామ రిలీజ్ అయింది . ఇక ఎం ఎస్ నారాయణ నటించిన పటాస్ ,సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు ఆయన చనిపోయిన తర్వాత రిలీజ్ అయ్యాయి అప్పటికే అయన 700 సినిమాల్లో నటించారు .అప్పట్లో కన్నడ సూపర్ స్టార్ గ ఉన్న శంకర్ నాగ్ చనిపోయిన తర్వాత మూడు సంవత్సరాల వరకు అయన సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయట .ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసిన అచ్యుత్ చనిపోయే ముందు తీసిన ఆఖరి సినిమా ఒక్కడు . ఇక శ్రీహరి గారి మరణం కూడా ఇండస్ట్రీ కి ఓ తీరని లోటు .. ఆయన చేసిన చాల సినిమాలకి వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు . ఇక ఆర్తి అగర్వాల్ లైపో ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వాళ్ళ చనిపోయారు . ఆమె అప్పటికే ఆమె ఎవరు అనే సినిమా పూర్తి చేసారు ఈ సినిమా ఆమె చనిపోయిన చాల రోజులకి రిలీజ్ అయింది .. దర్శక దిగ్గజం యాష్ చోప్రా జబ తక్ హైజాన్ మూవీ అయన చనిపోయిన తర్వాత రిలీజ్ అయింది . యాక్షన్ కింగ్ బ్రూస్లీ మరణానంతరం గేమ్ అఫ్ డెత్ మూవీ రిలీజ్ అయింది .వీళ్ళ స్థానాల్ని రీప్లేస్ చెయ్యాలంటే మళ్లీ వాళ్ళే పుట్టాలి అంటున్నారు వీళ్ళ అభిమానులు .