వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయి… నిన్నా మొన్నటివరకు కొన్ని చోట్ల వర్షం దంచికొట్టిన సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు వాతావరణంలో మార్పుల కారణంగా మూడు రోజుల పాటు భారీగా ఉష్ఫోగ్రతలు నమోదు అవుతాయని తాజాగా వాతావరణ శాఖ తెలిపింది…
తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉష్ణోగ్రత నమోదు అవుతుందని తెలిపింది… హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉష్షోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది… అలాగే ఏపీలో విశాఖ, కృష్ణా, నెల్లూరు జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది…