దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టాలంటే ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే… మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్తే వారికి ఫైన్ విధించేవారు… అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది..
ఇక నుంచి ఒంటరిగా బైక్ పై వెళ్లే వారు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరంలేదని తెలిపింది.. అలాగే సైకిల్ పై వెళ్లే వారు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరంలేదని కారులో ఒంటరిగా ప్రయాణం చేసేవారు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవరంలేదని తెలిపింది…
కారులో ఇద్దరు వెళ్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని తెలిపింది… ఇంతకు ముందు మాస్క్ పెట్టుకోకుండా తిరిగితే పోలీసులు చలానాలు విధించేవారు… అయితే ఇటీవలే దీనిపై ప్రజల నుంచి నిరసనలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది….