వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాలు ఎక్కడ పెడితే మంచిదంటే

వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాలు ఎక్కడ పెడితే మంచిదంటే

0
89

ఈ మధ్య చాలా మంది ఇళ్లు కడుతున్న సమయంలో వాస్తు కూడా పట్టించుకోవడం లేదు, గతంలో వాస్తు ప్రకారం కట్టేవారు ఇప్పుడు కొందరు అవేమీ పట్టించుకోకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు, డిజైన్లు ఇంటీరియర్ తో చాలా కాస్ట్ గా నిర్మిస్తున్నారు, అయితే మరికొందరు మాత్రం పక్కా వాస్తుని నమ్మి కడుతున్నారు.

అయితే ఇంటిలో ఏ దిక్కున ఏమి ఉండాలి, కిటికీలు, గుమ్మాలు ,దేవుని మందిరం, ఇలా అన్నింటికి వాస్తు లెక్క ఉంటుంది, అంతేకాదు ఇంటిలో అద్దం కూడా ఎక్కడ ఉండాలి అనేది కూడా చెబుతున్నారు పండితులు.

అద్దాలు వాస్తు ప్రకారం ఉండాలి ఎందుకు అంటే మనం నిత్యం మన అందం ముఖం చూసుకునేది ఇందులోనే.. అయితే ఇక్కడ నెగిటీవ్ ఇంపాక్ట్ ఉంటే రోజంతా మన పని అలాగే ఉంటుంది.
మీరు ఇళ్లలో అద్దాలను గది మధ్యలో పెట్టవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏదైనా మూలకు అద్దాలను ఉంచాలట. నిద్రపోయి లేచే వాళ్లు తమ ముఖం అద్దంలో చూసుకోకూడదు ఇది నెగిటీవ్ ఎనర్జీ నింపుతుంది.

అద్దాన్ని తూర్పువైపు ఉన్న మూలలో ఉంచితే… ఎక్కువ మంచి ఫలితం కనిపిస్తుంది.. అలాగే
ఇంటికి ఉత్తరంవైపు డోర్లు, కిటికీల వంటివి లేకపోతే, అప్పుడు పొడవాటి అద్దాన్ని డోర్లా పెట్టుకోవచ్చు, అసలు విరిగిన పగిలిన అద్దాలు ఇంటిలో ఉంచకూడదు, ఇక దేవుడి గదిలో కిచెన్ లో అద్దాన్ని పెట్టకూడదు అంటున్నారు నిపుణులు