బిగ్ బాస్ రియాల్టీ షో ఎప్పుడు – ఎక్కడ స్టార్ట్ అయింది దాని చరిత్ర ?

బిగ్ బాస్ రియాల్టీ షో ఎప్పుడు - ఎక్కడ స్టార్ట్ అయింది దాని చరిత్ర ?

0
94

బిగ్ బాస్ రియాల్టీ షో అంటే చాలా మందికి ఇష్టం, అయితే ఇది మన దేశంలో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది, మరీ ముఖ్యంగా బుల్లితెరలో సంచనం అనే చెప్పాలి, ప్రతీ ఏడాది టీఆర్పీలో ఇదే ఉంటుంది, ఇక బాలీవుడ్ లో ఎంతో సక్సెస్ అయి అక్కడ సల్మాన్ హోస్ట్ లో నడుస్తోంది.

అయితే మనం ఇంత ఇష్టంగా చూస్తున్న బిగ్ బాస్ ఎలా పుట్టింది, అసలు ఇది మన ఇండియాలోనే డిజైన్ అయిందా? ఈ ఆలోచన ఎవరిది? కొందరిని ఇలా ఇంట్లో ఉంచి హౌస్ రన్ చేయడం అనేది అసలు ఎక్కడ బీజం పడింది అనేది చూస్తే దీని వెనుక స్టోరీ ఉంది.

ఈ షో మొదటిసారి నెదర్లాండ్స్ దేశంలో ప్రసారమైంది. ఒక డచ్ మీడియా కంపెనీ యజమాని జాన్ డి మోల్ జూనియర్ ఈ షోను రూపొందించారు. అయితే ఇలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అంటే, నైంటీన్ ఎయిటీ ఫోర్ అనే నవల ఆయన చదివారు, దాని నుంచి బిగ్ బ్రదర్ అనే పేరును తీసుకుని ఈ షో మొత్తం డిజైన్ చేశారు.

1999లో తొలిసారి బిగ్ బ్రదర్ షో బుల్లితెరలో వచ్చింది, ముందు పెద్ద అక్కడ ఎవరూ దీనిని ఆదరించలేదు, ఆనాటి యువత ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత దీనిని చూడటం అలవాటు చేసుకున్నారు, ఇలా అక్కడ నుంచి దాదాపు 54 దేశాల ప్రజలకు బిగ్ బ్రదర్ పరిచయం అయింది. ఇక ఒక్కోదేశంలో ఉన్న నిర్వాహకులు దాని పేరు మార్చి బిగ్ బాస్, బిగ్ టీం, బిగ్ హోం ఇలా అనేక పేర్లతో స్టార్ట్ చేశారు.

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ద్వారా ఈ బిగ్ బ్రదర్ షో భారతీయులకు పరిచయం అయింది. 2007లో బ్రిటిష్ బిగ్ బ్రదర్షోలో ఆమె పాల్గొని విజేతగా నిలిచింది. తరువాత ఈ షో హిందీలోకి వచ్చింది. ఇక అక్కడ నుంచి మన దేశంలో బాలీవుడ్ లో స్టార్ట్ అయి నేడు ప్రాంతీయ భాషల్లో దుమ్ముదులుపుతోంది.

హిందీ
తెలుగు
తమిళ
కన్నడ భాషల్లో ఈ షో నిర్వహిస్తున్నారు.