చాలా మంది ఉదయం లేవగానే కాఫీ టీ తాగుతారు… అది తాగనిదే తమ బండి ముందుకు కదలదు అని చెబుతారు, అయితే ఆరోగ్యానికి కాఫీలు టీలు ఎక్కువ తాగితే ఇబ్బంది, అయితే ఉదయం లేవగానే ముఖం కడిగిన వెంటనే వేడి నీరు కాచి చల్లారిన తర్వాత అంటే గోరు వెచ్చగా తీసుకున్నా చాలా మంచిది.
వేడిగా అస్సలు తీసుకోకూడదు, ఇక అందులో ఎలాంటి కషాయాలు కూడా తీసుకోకండి, లోపల అవయవాలకు వేడి నీరు తాగడం వల్ల ఇబ్బంది వస్తుంది, అందుకే గోరు వెచ్చని నీరు మాత్రమే తాగాలి. అయితే ఈ సమయంలో నిమ్మరసం తాగితే చాలా మంచిది, అందులో పంచదార బెల్లం ఇవేమీ తీసుకోకుండా స్పూన్ తేనే తీసుకుని ఓ నిమ్మకాయ బాగా పండినది తీసుకుని రసం తాగండి, ఇలా తాగడం వల్ల శరీరంలో కొవ్వు, పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.
క్యాన్సర్ కణాలను చంపే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. నిమ్మకాయలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో సహాయపడుతుంది. ఇన్ ఫెక్షన్లు వైరస్ ఇబ్బందులు, జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు రావు, ఈ కరోనా సమయంలో ఇది ఇంకా మంచిది.అంతేకాక నిమ్మ మంచి మలబద్దక నివారిణిగా పనిచేస్తుంది, అందుకే నిమ్మరసం తీసుకుంటే ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది. ఇక పంచదార ఉప్పు ఇలాంటివి వేసి ఆ నిమ్మరసం తీసుకోవద్దు.