దారుణం ఆసుపత్రిలో బిల్లు కట్టకుంటే బిడ్డను ఇవ్వరట….

దారుణం ఆసుపత్రిలో బిల్లు కట్టకుంటే బిడ్డను ఇవ్వరట....

0
84

కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల అరాచకం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే సాక్షం…ఉత్రర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది… 36 ఏళ్ల నిరుపేద మహిళ గర్భవతి అయింది… అమె భర్త శిచరణ్ రిక్షా తొక్కుతుంటాడు…

భార్యకు నొప్పులు రావడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు..అక్కడి డాక్టర్లు ఆమె చేతిలో బిల్లు పెట్టి షాక్ ఇచ్చారు.. ఎందుకంటే అన్ని ఖర్చులు కలిపి 35 వేలు బిల్లు వేసింది యాజమాన్యం..అంత మొత్తం తాను చెల్లించే స్తోమత లేదని తాను పొదుపు చేసిన మొత్తాన్ని ఇస్తానని వేడుకున్నాడు… తమ ఆర్థిక పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశాడు… అందుకు ససేమీరా అన్న ఆసుపత్రి యాజమాన్యం ఊహించని ప్రపోజల్ ను తెరమీదకు తెచ్చింది…

మీకు బిల్లుకట్టడం కుదరకుంటే బిడ్డను అమ్మేయండి వచ్చిన డబ్బులు మాకివ్వండి అంటూ చెప్పారు… అక్కడితో ఆగని వారు బిడ్డని మాకివ్వండి లక్షరూపాయాలు ఇస్తామంటూ ఆసుపత్రికి పైసా కట్టాల్సిన అవసరం లేదంటూ చెప్పారు… దీంతో బిత్తర పోయిన భార్యభర్తలు మీడియా ద్వారా తమ గోడును చెప్పుకున్నారు…