బంగారం ధరకు మళ్లీ రెక్కలు వచ్చాయి… గడిచిన వారం రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర తగ్గుతున్నా ఇక్కడ మాత్రం బంగారం ధర ఇండియాలో పెరుగుతోంది. మరి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.49,090కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.260 పైకి కదిలింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,550కు చేరింది.
పసిడి ధర పరుగులు పెడితే.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గింది. దీంతో ధర రూ.67,900కు చేరింది…వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల పతనంతో బంగారం ధర పెరుగుతోంది.