రేషన్ కార్డులు మన దేశంలో చాలా మందికి ఉంటాయి, అయితే ఇది పేదల కోసం తీసుకువచ్చిన ఓ స్కీమ్ అని చెప్పాలి, బీపిఎల్ కుటుంబాల వారికి ఈ రేషన్ అందిస్తారు, అయితే ఈ కార్డులు ఉన్నవారికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా చౌక ధరలే రేషన్ సరుకులు ప్రభుత్వాలు అందిస్తాయి.
అయితే బీపీఎల్ – apl లో ఉన్నవారికి అలాగే అంత్యోదయ- వికలాంగులుకు ప్రత్యేకంగా గుర్తించి వారికి ఈ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది, అయితే ఇవి పేదల కోసం తీసుకువచ్చిన స్కీమ్ లు, అయితే కొందరు తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి రేషన్ కార్డు పొందిన వారు ఉంటారు.
కారు పొలాలు స్ధలాలు లగ్జరీ లైఫ్ అనుభవించే వారు కూడా తప్పుడు పత్రాలు ఇచ్చి రేషన్ కార్డులు పొందిన వారు ఉన్నారు, అయితే వీరి వల్ల అసలైన పేదలకు రేషన్ రాకుండా పోతోంది,
రేషన్ను కార్డును తప్పుడు డాక్యుమెంట్లతో పొందితే మాత్రం జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. అలాగే జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది.
దీనికి సంబంధించి చట్టం ఏం చెబుతుంది అంటే.. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం.. మీరు ఫేక్ డాక్యుమెంట్లతో రేషన్ కార్డు పొందినా లేదంటే నకిలీ రేషన్ కార్డు తయారు చేసినా ఐదేళ్లపాటు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఎంత జరిమానా విధించినా కట్టాల్సిందే. సో ఇలా రేషన్ పొందితే మీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అధికారులు.