ఈ గుడిలో ప్రసాదంగా గంజాయి ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ గుడిలో ప్రసాదంగా గంజాయి ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0
82

మనకు గుడిలో ప్రసాదం అంటే ఎక్కడైనా కొబ్బరి అరటిపండు లడ్డూ పులిహర చక్రపొంగలి ఇలా వింటూ ఉంటాం, కాని ఇక్కడ గుడిలో ఏ ప్రసాదం పెడతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు, అవును ఈ ఆలయంలో నిషేధిత మత్తు పదార్థం గంజాయిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేస్తారు,మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది అంటే.

కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని కొన్ని ఆలయాలు, మఠాల్లో ఈ గంజాయి సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. కొన్ని సామాజిక వర్గాల్లో గంజాయిని ప్రసాదంలా స్వీకరించే ఆనవాయితీ ఉండటంతో.. దానిని ఇలా కొనసాగిస్తున్నామని వారు చెబుతున్నారు, అయితే ఇలా ఎక్కడ తీసుకుంటున్నారు అంటే

కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని యాద్గిర్ జిల్లా, తింథినిలో ఉన్న మౌనీశ్వర ఆలయంలో భక్తులకు చిన్న చిన్న గంజాయి పాకెట్లను అధికారికంగానే ప్రసాదంలా పంచుతున్నారు..పరశురాముడిని మౌనీశ్వరుడిగా, మానప్పగా ఆరాధిస్తారు ఇక్కడ ఆలయంలో. ఈ ప్రాంతానికి దేశంలో చాలా ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుంటారు.. గంజాయిని సేవించడం వల్ల ధ్యానంలోకి వెళ్లొచ్చనే భావన వారిలో ఉందని అందుకే ఇలా తీసుకుంటారు అని చెబుతున్నారు. ఇక్కడకు సాధువులు అధికంగా వస్తారు, అయితే భక్తులకి ఒక ప్రసాదం మాత్రమే ఇస్తారు, ఇక ఆలయ ఆవరణలోనే ఈ ప్రసాదం తీసుకోవాలి బయట తీసుకోకూడదు.