28 మద్యం బాటిళ్లతో ఓ ఇంటివాడయ్యాడు – వండర్ స్టోరీ

28 మద్యం బాటిళ్లతో ఓ ఇంటివాడయ్యాడు - వండర్ స్టోరీ

0
95

సాధారణంగా ఎవరైనా మందు బాటిల్ ఇస్తే వెంటనే అది తాగి పక్కనపడేస్తాం, తర్వాత వాటిని ఓ పాత సామాన్లు వాడికో అమ్ముతాం ఇలా చాలా మంది ఇళ్ల్లలో బాటిల్లు ఖాళీవి కనిపిస్తూ ఉంటాయి, అయితే మందు బాటిల్స్ తో ఓ వ్యక్తి ఎవరూ ఊహించని పని చేశాడు, ఇదే ఇప్పుడు పెను వార్తగా మారింది.

తండ్రి ఇచ్చిన మద్యం బాటిళ్లను జాగ్రత్తగా దాచుకున్నాడు. ఒకటికాదు రెండేళ్లు కాదు….28 ఏళ్లపాటు ప్రతి ఏడాది తండ్రి తన పుట్టినరోజునాడు ఇచ్చిన బాటిళ్లను జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడు.తన 28 వ పుట్టినరోజు తరువాత ఇల్లు కొనాలని అనుకున్నారు.

కాని ఆ ఇల్లు కొనాలి అంటే అతని దగ్గర నగదు అంత లేదు, దీంతో అతని తండ్రి ఇచ్చిన బాటిల్స్ గుర్తు వచ్చాయి, వాటిని అమ్మాలి అని అనుకున్నాడు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో ఇల్లు కొన్నాడు. ఈ సంఘటన స్కాట్లాండ్లో జరిగింది. మాధ్యూ 1992 లో జన్మించాడు. అలా పుట్టిన సమయంలో తన తండ్రి కొడుక్కు మద్యం బాటిల్ కొనిచ్చాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది పుట్టినరోజునాడు మద్యం బాటిల్ కొనివ్వడం ఆనవాయితీగా మారింది. అయితే దాదాపు అంత పాత మద్యం బాటిల్స్ కావడంతో అవి భారీ నగదుకు కొనుక్కున్నారు అక్కడ వారు, ఇదే అతనికి బాగా పనికి వచ్చింది. ఇక తను దాచుకున్న డబ్బుతో ఫర్నిచర్ కొనుక్కున్నాడు, వచ్చే నెలలో తన తండ్రిని తీసుకుని ఆ ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నాడు మాధ్యూ.