ఫ్లాష్ న్యూస్ – స్వామి అగ్నివేశ్ ఇకలేరు- ఆయ‌న మ‌న తెలుగువారే

ఫ్లాష్ న్యూస్ - స్వామి అగ్నివేశ్ ఇకలేరు- ఆయ‌న మ‌న తెలుగువారే

0
89

ఆర్యసమాజ్ నేత, జాతీయస్థాయి సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ ,ఆయ‌న తెలియ‌ని వారు ఉండ‌రు, అన్నీ రంగాల వారికి బాగా తెలిసిన ప్ర‌ముఖ వ్య‌క్తి, అయితే ఆయ‌న ఇక‌లేరు, అగ్నివేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా ఆయన ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు.

ఆయ‌న కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు, అయితే వెంటిలేట‌ర్ పై ఆయ‌న‌కు అక్క‌డ వైద్యులు చికిత్స అందించారు.. కాని గుండెపోటు రావ‌డంతో ఆయ‌న క‌న్నుమూశారు, ఆయ‌న మ‌ర‌ణంతో దేశంలో ప్ర‌ముఖులు అంద‌రూ కూడా సంతాపం తెలిపారు.

అయితే ఆయ‌న పుట్టింది పెరిగింది మ‌న ‌తెలుగు నేల‌పైనే, ఆయ‌న‌ది శ్రీకాకుళం జిల్లా.
స్వామి అగ్నివేశ్ వయసు 80 సంవత్సరాలు. ఆయన 1939 సెప్టెంబరు 21న శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు వేప శ్యాంరావు. ఆయన కోల్ కతాలో విద్యాభ్యాసం చేశారు. బాగా ఉన్న‌త విద్య చ‌దువుకున్న వ్య‌క్తి, అంతేకాదు లా కామ‌ర్స్ ప‌ట్టా కూడా అందుకున్నారు, ఇక ఆయ‌న ఆర్య‌స‌భ అనే పార్టీని కూడా గ‌తంలో స్ధాపించారు, 1977లో హర్యానాలో శాసనసభ్యుడిగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు.