తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు… జనసేన పార్టీని స్థాపించారు… అయితే తొలిసారి ఏపీలో 2014 సార్వత్రిక ఎన్నికలు జరుగగా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు… ఆ తర్వాత టీడీపీతో సూమారు రెండున్నర సంవత్సరాలు కలిసి ఉన్న పవన్ ఆతర్వాత విడిపోయాడు…
2019 ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు…. ఆ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కింది… అదికూడా రాజోలు సీటు.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు…. ఇక పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందాను… ఆరెండు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది….
ఈ రెండు స్థానాల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రిపదవి దక్కుతుందని అందరు భావించారు… కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వారికి మంత్రి పదవి దక్కలేదు.. అయితే ఇప్పుడు వీరిద్దరికి జగన్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి… నాగిరెడ్డికి ఈబీసీకార్పోరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు… ఇక భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు వచ్చే క్యాబినెట్ విస్తరణలో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి…