స్టార్ హీరోయిన్ తన లవర్ తో కలిసి గోవాకు చెక్కేసింది… ఇంతకు ఎవరా స్టార్ హీరోయిన్ అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా… హీరోయిన్ నయనతార… ఈ ముద్దుగుమ్మ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే… తమిళ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఇందా అంటే వీరిద్దరి లవ్ స్టోరీనే అంటారు…
వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… ఈ జంట హాలిడేలో ప్రతీ సారి అమెరికాకు వెళ్లేది… కానీ కరోనా కారణంగా దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది…
తాజాగా ఈ ప్రేమ జంట గోవాకు వెళ్లింది… అక్కడ నయనతార విఘ్నేష్ శివన్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…