పవన్ – క్రిష్ కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే ఫిక్స్… ?

పవన్ - క్రిష్ కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే ఫిక్స్... ?

0
95

జనసేన పార్టీ అధినేత సౌత్ ఇండియా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… పవన్ వరుస చిత్రాలను సైన్ చేసి అభిమానులను అలరించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.. తొలుత వకీల్ సాబ్ మూవీ చేస్తున్నాడు పవన్ ..

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తి అయింది.. కరోనా కారణంగా షూటింగ్ బంద్ అయింది… ఇక మిగిలిన షూటింగ్ ను త్వరలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు… ఈ చిత్రం తర్వాత పవన్, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు… ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీయనున్నారు…

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు టైటిల్ పేర్లు వైరల్ అవుతున్నాయి.. మొదట్లో విరుపాక్ష అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి… ఆతర్వాత దొంగా అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్… ఇప్పుడు ఓం శివమ్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,.. అంతేకాదు నిర్మాతలు ఈ టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి…