తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో బీబీ3 (వర్కింగ్ టైటిల్) వస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, సంహా చిత్రాలు బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే…
ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో చిత్రం వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి… బాలయ్యకు తగ్గకుండా విలన్ పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట దర్శకుడు బోయపాటి… వాస్తవానికి ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ రోల్ లో నటిస్తారని గతంలో వార్తలు వచ్చాయి…
అయితే ఆయన క్యాన్సర్ చికిత్స కోసం యూఎస్ వెళ్లాడు ఆతర్వాత వివేక్ ఒబెరాయ్ పేరు పరిశీలిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి… తాజా సమాచారం ప్రకారం తెలుగులో పలువురు యాక్టర్లను దర్శకుడు బోయపాటి సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..