బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 స్టార్ట్ అయింది. ఇందులో 16 మంది కంటెస్టెంట్స్ వచ్చారు, అయితే బిగ్ బాస్ లో అందాల తార దివిని చూసి అందరూ ఆమె బాగా హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటోంది అంటున్నారు, అయితే అసలు ఈ దివి ఎవరు ఆమె గురించి అనేక విషయాలు తెలుసుకోవాలి అని సెర్చ్ చేస్తున్నారు.
మరి ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, దివి పుట్టింది పెరిగింది హైదరాబాద్ లో, ఆమె
పేరు దివి వద్త్యా , ఆమె వయసు 24 ఏళ్లు….ఇక మూవీలు చేయకముందు ఆమె మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది, ఆ తర్వాత లోకల్ బ్రాండ్స్ కు యాడ్స్ చేసింది, పలు వెబ్ సిరీస్ లు చేసింది.
2019లో రిలీజ్ అయిన మహర్షి సినిమాలో చిన్న రోల్లో నటించి వెండితెర మీద అదృష్టాన్నీ పరీక్షించుకుంది. ఆమె ఓ సీన్ ఓ సాంగ్ లో కూడా కనిపిస్తుంది, ఆమె ఎంబీఐ పూర్తి చేసింది, చిన్నతనం నుంచి ఆమెకి యాక్టింగ్ అంటే ఇష్టం, అలా ఆమె సినిమాల్లోకి వచ్చింది.
మోడలింగ్ చేస్తూ ఇలా పలు వెబ్ సిరిస్ లో నటించింది, తండ్రి సోదరుడు వైద్యులు
ఆమె చదువు అంతా హైదరాబాద్ లో అయింది, ఇక ఆమెకి ఇక్కడ కల్చర్ అంటే చాలా ఇష్టం,
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో, ఇక్కడకు సెలబ్రెటీలు వస్తారు, కాని నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్లి సెలబ్రెటీ అవ్వాలి అని అనుకుంటున్నా అని చెప్పింది దివి. ఆమెకి సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.