బ్రేకింగ్ –భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ – ఇక భ‌యం వ‌ద్దు

బ్రేకింగ్ --భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ - ఇక భ‌యం వ‌ద్దు

0
74

మ‌న దేశంలో ప‌లు కంపెనీలు వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్నం అయ్యాయి, అయితే ముఖ్యంగా
భారత్ లో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంస్థలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కూడా ఒక‌టి ఇప్ప‌టీకే ట్ర‌య‌ల్స్ సత్ఫ‌లితాలు ఇస్తున్నాయి.

భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. జంతువులపై కోవాగ్జిన్ ప్రయోగ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, ఇప్ప‌టికే జంతువుల‌పై ప్ర‌యోగాలు చేశాము అని ఎలాంటి దుష్ప్ర‌భావాలు లేవు అని తెలిపింది కంపెనీ.

ఆ జంతువుల‌కి సెకండ్ డోస్ ఇచ్చారు, 14 రోజులు టెస్ట్ చేశారు, ఇక వాటి శ‌రీరంలో ముక్కు గొంతు ఊపిరితిత్తుల ద‌గ్గ‌ర ఈ క్రిములు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి అని తేలింది, ఇలా మంచి గుడ్ న్యూస్ చెప్ప‌డంతో భార‌త్ లో సీర‌మ్ ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తో పాటు బ‌యోటెక్ వ్యాక్సిన్ కూడా వ‌చ్చే రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతుంది అని అంద‌రూ ఆశాజ‌న‌కంగా ఉన్నారు.