చంద్రబాబుకు షాక్ వైసీపీలోకి మరో మాజీ….

చంద్రబాబుకు షాక్ వైసీపీలోకి మరో మాజీ....

0
113

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులు తున్నారు… రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో చాలామంది నేతలు సైకిల్ దిగి ఫ్యాన్ కింద చేరుతున్నారు.. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైసీపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే….

ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరంగా ఉంటున్నారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోకముందే మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఆ పార్టీ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి..

2014 ఎన్నికల్లో శ్రవణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావు వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు కొన్ని రోజుల తర్వాత ఆయనను మావోయిస్టులు హత్య చేశారు… ఆతర్వాత శ్రవణ్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు… చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు… 2019 ఎన్నికల్లో తొలిసారి ఆయన పోటీ చేశారు కానీ ఓటమి చెందారు… ఇక అప్పటినుంచి శ్రవణ్ పార్టీలో యాక్టివ్ గా కనిపించకున్నారు.. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి…