సెప్టెంబర్ 08 2018 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించిన విషయం తెలిసిందే… అయితే అప్పట్లో సమయభావం ఇతర కారణాలవల్ల ఆయన కలలు కన్న ఫ్రంట్ రైలు బండి పట్టాలెక్కలేకపోయింది…
నేడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతోండటం త్వరలోనే జమిలీ ఎన్నికలు జరగవచ్చన్న ఊహగానాలు వినపడుతోండటంతో తదితరాల నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరోసారి దృష్టిని కేంద్రీకరించినట్లు తెలుస్తోంది… స్వతహాగానే ముందుచూపు గలనేత కేసీఆర్ బీజేపీ తాజా దుందుడుగు చర్యలను నిశీతంగా గమనిస్తున్న విషయం తెలిసిందే…
2022 చివరిలో లేదంటే 2023 లో జమిలీ ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాలు కేంద్రంలో అధ్యక్ష ఎన్నికలపై కమిటీ ఏర్పాటు లోక్ సభ ఎన్నికలకు జాతీయ పార్టీలే పోటీ చేయాలనే నిబంధన తదితరరాల నేపథ్యంలో కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి… బీజేపీ చర్యకు ప్రతీ చర్య అన్నట్లు జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం… అందరి అభిప్రాయాలను తెలుసుకుని కొత్త పార్టీకి నవభారత్ అనే పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి…