తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనుంది, గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్ధానాలు భర్తీ చేయనున్నారు, దీనిపై సీఎం కేసీఆర్ ఎవరికి పదవులు ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తున్నారు, అయితే తాజాగా కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.
తెలంగాణకు చెందిన ప్రజాగాయకుడు గోరటి వెంకన్నను ఎమ్మెల్సీ పదవి వరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్నకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆలోచన చేస్తుందట..ఉద్యమ సమయంలో ఆయన పాటలతో ఎంతో స్పూర్తి నింపాడు.
ఇక రెండో సీటు కర్నె ప్రభాకర్ పేరు పక్కా అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మూడో సీటు విషయంలో నాయిని పేరు వినిపిస్తోంది, అలాగే మాజీ ఎంపీ సీతారాంనాయక్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి, ఇక సిరికొండ మధుసూదనాచారి, తుల ఉమ, గుండు సుధారాణి, పిడమర్తి రవి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, చాడ కిషన్‌రెడ్డి, ఆర్. సత్యనారాయణ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.