సెప్టెంబర్ 25 నుంచి భార‌త్ లో రెండోద‌శ లాక్ డౌన్ – క్లారిటీ ఇచ్చిన కేంద్రం

సెప్టెంబర్ 25 నుంచి భార‌త్ లో రెండోద‌శ లాక్ డౌన్ - క్లారిటీ ఇచ్చిన కేంద్రం

0
88

దేశంలో మ‌రోసారి లాక్ డౌన్ విధిస్తారు అని మ‌ళ్లీ వార్త‌లు వినిపిస్తున్నా‌యి, అంతేకాదు ఈ విష‌యంలో ప్ర‌ధా‌ని న‌రేంద్ర‌మోదీకి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ లేఖ రాసింది అని అనేక వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి, అయితే ఇందులో ఏ మాత్రం వాస్త‌వం లేదు అని కేంద్రం తెలిపింది.

ఇది న‌మ్మ‌ద‌గిన వార్త కాదు అని తెలిపింది.. ఈ విష‌యంలో డిజిట‌ల్ మీడియా సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌చ్చాయి.. సెప్టెంబ‌ర్ 25 నుంచి లాక్ డౌన్ అని వార్త‌లు వినిపించాయి.. కాని ఇది పూర్తి అవాస్త‌వం, ఇక ఈవార్త‌లు న‌మ్మ‌వ‌ద్దు అని తెలిపింది.

వైర‌ల్ అవుతున్న వార్త‌లో సెప్టెంబర్ 25 అర్ధరాత్రి నుంచి 46 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని సూచించినట్లు అందులో ఉంది. నిత్యావసర సరుకుల సరఫరా గొలుసులో ఇబ్బందులు రాకుండా ప్లాన్ సిద్ధం చేసుకోవాలని లేఖలో పేర్కొనట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. సో ఇలాంటి వార్త‌లు ఎవ‌రూ స్పెడ్ చేయ‌వ‌ద్దు, PIB ఫ్యాక్ట్ చెక్ దీనిపై స్పష్ట‌‌త ఇచ్చింది.