టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు… కరోనా మహమ్మారి రాకుంటే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యేది కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ పూర్తి అవ్వలేదు… ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మరో చిత్రం చేస్తున్నాడు…
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవిందసమేత చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నిల్ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి
ఇటీవలే ప్రశాంత్ నిల్ ప్రత్యేకంగా ఎన్టీఆర్ తో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి… ఇక అతను చెప్పిన కథకు ఎన్టీఆర్ ఓకే చెప్పారట… తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం బయోవార్ నేపథ్యంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి.. ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు..