పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది

0
105

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రాబోతోంది… ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది… నటిగా దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఇడస్ట్రీకి దూరమైంది…

అయితే అభిమానులకు మాత్రం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో టచ్ లో ఉంటోంది… దీంతో ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి… అయితే తాజాగా ఈ వార్తలను ఆమె ధృవీకరించారు…

తాను ఒక వెబ్ సిరీస్ కోసం సంతకం చేశానని చెప్పింది… చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నానని అందుకు మీ అందరి ఆశిస్సులు కావాలని కోరింది… త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెళ్లడిస్తానని చెప్పింది…