కనుమరుగవుతున్న 2వేల నోట్లు… ఎందుకో తెలుసా…

కనుమరుగవుతున్న 2వేల నోట్లు... ఎందుకో తెలుసా...

0
84

2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఏ సర్కార్ 2016లో దేశంలో బ్లాక్ మనీని నియంత్రించాలనే ఉద్దేశంతో పెద్ద నోట్ల రద్దు చేశారు… వెయ్యి ఐదు వందల నోట్లను రద్దు చేశారు… వాటి స్థానంలో కొత్త ఐదు వందల నోట్లతోపాటు రెండువేల నోట్లను తీసుకువచ్చారు…

అయితే ఇటీవలే కాలంలో కేవలం ఐదు వందలు నోట్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. రెండువేల రూపాయల నోట్లు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి… ప్రస్తుతం ఏ ఏటీఎమ్ లో చూసినా కూడా కేవలం ఐదు వందల నోట్లు మాత్రమే వస్తున్నాయి…రెండు వేల నోట్లు అస్సలు రాకున్నాయి…

తాజా సమాచారం ప్రకారం… రెండువేల నోట్లను క్రమ క్రమగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి… కాగా ఇప్పటకే రెండు వేల నోట్లు ముద్రించడం లేదని ఆర్బీఐ ప్రకటించిన సంగతితెలిసిందే….