అలీకి కీలక పదవి ఇవ్వనున్న సీఎం జగన్ – వచ్చేవారం ప్రకటన

అలీకి కీలక పదవి ఇవ్వనున్న సీఎం జగన్ - వచ్చేవారం ప్రకటన

0
92

టాలీవుడ్ కమెడియన్ అలీ తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు, అయితే తాజాగా జరిగిన భేటీకి ఓ కారణం ఉంది అని తెలుస్తోంది, నేరుగా సీఎం జగన్ అలీని పిలిచినట్లు తెలుస్తోంది.

అయితే దీనికి గల కారణం అలీకి ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది, దానిపై అలీ అభిప్రాయం అడిగేందుకు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది, అయితే దీనిపై ఈ వారంలో కీలక ప్రకటన వస్తుంది అని తెలుస్తోంది.

ఆయన ఎన్నికల ముందు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే, రాజమండ్రి లేదా గుంటూరు ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా సీటు ఆశించారు ..కాని ముందు సెగ్మెంట్లో అభ్యర్దులని ఫిక్స్ చేయడంతో ఆయనకి టికెట్ రాలేదు, అయితే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు అని వార్తలు వచ్చాయి, తాజా రాజకీయ కారణాలతో ఆయనకు ముందు ఈ పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.