కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది, చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే మూడు కోట్ల మందికి తొమ్మిది నెలల్లో పాకింది, అయితే ఇప్పుడు చైనా ఈ కరోనా నుంచి కాస్త కోలుకుంది.. కాని తాజాగా కరోనా కేసులు తగ్గితే మరో గండం చైనాని వణికిస్తోంది.
వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్ రాజధాని లాంగ్ఝౌలో అనేక వేల మంది బ్యాక్టీరియా వల్ల మాల్టా అనే వ్యాధి బారిన పడ్డారు. దాదాపు 3200 మందికి ఇక్కడ ఈ వ్యాధి సోకింది అని తేలింది, దీనిపై పరిశోధనలు చేస్తున్నారు ఇక్కడ నిపుణులు.
గత ఏడాది బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో వాయువులు లీక్ కావడంతో ఈ కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందిందని అధికారులు వెల్లడించారు. బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సోకింది. అయితే గతేడాది జూలై-ఆగస్టు మధ్య ఝోంగ్ము లాంగ్ఝౌ బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి విడుదల అయింది అని తెలుస్తోంది.
అయితే ఈ బ్యాక్టిరీయా సోకిన వారికి జ్వరం వాంతులు తలనొప్పి వస్తున్నాయి.. బాగా నీరసం ఉంటోంది
తలనొప్పి కండరాల నొప్పి జ్వరం అలసట ఆర్థరైటిస్ సమస్యలు వస్తున్నాయి అని తేలింది, అయితే ఇది మనిషి నుంచి మనిషికి సోకదు .. బ్యాక్టీరియా ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది, ఇది మరింత డేంజర్ అంటున్నారు వైద్యులు.