దేత్తడి హారిక ఆమె పూర్తి పేరు హరిక అలేఖ్య, దేత్తడి కామెడీ సిరీస్ ద్వారా ఆమె ఫేమస్ అయింది. అంతేకాదు ఆమె డ్యాన్స్ అద్బుతంగా చేస్తుంది…ఫ్రస్టేటెడ్ తెలంగాణ పిల్లగా పేరు సంపాదించింది
ఆమె రియల్ స్టోరీ చూస్తే.
1997 లో ఆమె జన్మించింది, ఆమెది హైదరాబాద్, ఇక ఆమె చిన్నతనం నుంచి స్కూల్లో బాగా చదివేది, ఇంగ్లీష్ హిందీ తెలుగు బాగా వచ్చు, ఆమె హైదరాబాద్ లో డిగ్రీచదివింది, వెంటనే ఆమె అమెజాన్ కంపెనీలో మంచి జాబ్ సంపాదించింది కొన్నేళ్లు ఆమె జాబ్ చేసింది.
తర్వాత ఆమెకి సినిమాలపై యాక్టింగ్ పై ఇంట్రస్ట్ ఉండటంతో ఓ ఏడాది ఈ జాబ్ వదిలేసి ఇవి ప్రయత్నించాలి అని అనుకుంది, ఒకవేళ అవకాశాలు రాకపోతే మళ్లీ జాబ్ చేయాలి అని భావించింది, అయితే ఆమె దేత్తడి కామెడీ సిరీస్ స్టార్ట్ చేసింది, ఆరు నెలల్లో సోషల్ మీడియా స్టార్ గా అయింది, తర్వాత తెలంగాణ ఫ్రస్టేటెడ్ అమ్మాయిగా పేరు సంపాదించింది, ఆమె వీడియోలకి మిలియన్ వ్యూస్ వచ్చేవి..చెర్రీ అనే ముద్దుపేరుతో ఆమెని పిలుస్తారు….ఆదిత్య వర్మ అనే సినిమాలో కీ రోల్ నటించింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది.