దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మాణం ఎక్క‌డంటే

దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మాణం ఎక్క‌డంటే

0
238

రామోజీ ఫిలిం సిటీ మ‌న దేశంలో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ఫిల్మ్ సిటీ అనే విష‌యం తెలిసిందే, అయితే తాజాగా దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మాణం చేయ‌నున్నార‌ట‌, మ‌రి ఎక్క‌డ అని చూస్తున్నారా, అదే తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. తాజాగా సీఎం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఇది మంచినిర్ణ‌యం అని అంటున్నారు.

గౌతం బుద్ధనగర్‌ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రే వే సమీపంలో స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి వ‌చ్చే ఏడాది దీనికి సంబంధించి ప‌ని ప్రారంభించే ఆలోచ‌న చేస్తోంది యోగి స‌ర్కార్.