పాత టీవీలు, రేడియోలలో నిజంగా ఆ వస్తువు ఉందా ? 10 లక్షలిస్తారా అసలు ఇది నిజమేనా

పాత టీవీలు, రేడియోలలో నిజంగా ఆ వస్తువు ఉందా ? 10 లక్షలిస్తారా అసలు ఇది నిజమేనా

0
86

నిజమే గత రెండు నెలలుగా మీ దగ్గర పాత టీవీ రేడియో కుట్టు మిషన్ ఉందా అనే ప్రశ్న ఎక్కడ విన్నా వినిపిస్తోంది, వారి ఇంటిలో అది ఉంటే పది నుంచి 20 లక్షలు ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు అనే వార్తలు వినిపించాయి, దీంతో పాత టీవీలు రేడియోలు ఉన్న వారి ఇళ్లలో చాలా మంది వచ్చి ఓ వస్తువు కోసం చూస్తున్నారు.

అయితే ఇలాంటివి బాగుచేసేవారి షాపుకి కూడా వెళుతున్నారు జనం.. అయితే వారికి మినిమం 50 ఏళ్ల క్రితం నాటి టీవీలు రేడియోలు కావాలి అని వారు కోరుతున్నారు, రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాలను జల్లెడ పట్టేస్తున్నారు.

అయితే ఇందులో ఏముంది అనేదిచూస్తే రెడ్ మెర్క్యురీ అనే విలువైన మూలకం ఉంది అంటున్నారు అది ఇప్పుడు దొరక్క దాని కోసం వెతుకులాట చేస్తున్నారట..అణ్వాయుధాల తయారీలో దీని అవసరముంటుందని… ప్రచారం జోరుగా సాగుతోంది. కాని ఇది నిజం కాదు అంటున్నారు పోలీసులు, ఇలాంటి వారి వల్ల మోసపోవద్దు అంటున్నారు, అసలు అలాంటి వస్తువు లేదని ఇలాంటి మాయలు మీ దగ్గర ప్రదర్శిస్తే కచ్చితంగా ఫిర్యాదు చేయాలి అంటున్నారు. బీకేర్ పుల్ ఇలాంటివి నమ్మి మోసపోకండి.