బ్రేకింగ్– బాలుని చూసేందుకు వ‌స్తున్న కుటుంబ స‌భ్యులు – ఏం జ‌రుగుతోంది

బ్రేకింగ్-- బాలుని చూసేందుకు వ‌స్తున్న కుటుంబ స‌భ్యులు - ఏం జ‌రుగుతోంది

0
100

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య ప‌రిస్దితి మ‌రింత విష‌మించింది, దీంతో ఆయ‌నకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు, అంతేకాదు ఇప్ప‌టి వ‌ర‌కూ కోలుకుంటున్నారు అని ఆనందించిన వారికి ఒక్క సారిగా ఈ వార్త షాకిచ్చింది.

చెన్నై ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్ లో బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం అని పేర్కొన్నారు. అంతేకాదు ఆయ‌న‌ని చూసేందుకు అభిమానులు కూడా అక్క‌డ‌కు చేరుకుంటున్నారు, ఇక ఆయ‌న కుటుంబం స‌భ్యుల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌డంతో బాలుని చూసేందుకు అక్క‌డ‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యులు వ‌స్తున్నారు.

సోద‌రి కుమారుడు అంద‌రూ అక్క‌డే ఉన్నారు ..ఆసుపత్రి ద‌గ్గ‌ర ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఉద‌యం మ‌రో బులెటిన్ ను విడుదల చేయనున్నారు. ఇప్ప‌టికే ప్రముఖ నటుడు కమలహాసన్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స జరుగుతోందని తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనకు వెంటిలేటర్, ఎక్మో కొనసాగించారు. నిన్న జ్వరం రావడంతో ఆయన పరిస్థితి క్షీణించినట్టు తెలుస్తోంది, ఇక క‌రోనామాత్రం లేదు ఆయ‌నకు మ‌రోసారి కూడా నెగిటీవ్ వ‌చ్చింది, ఆయ‌న గురించి దేశ వ్యాప్తంగా అంద‌రూ కోలుకోవాలి అని ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు.